News March 29, 2024
ఉద్యోగులపై దాడి చేసేందుకే ACB: నాదెండ్ల

కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకే ACBని ఉపయోగించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8 లక్షలకుపైగా ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? మంత్రులు, నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని CM తనకు తానే ప్రకటించుకుంటారు. గత ఐదేళ్లలో అవినీతి జరగలేదని ఏసీబీ అధికారులే ఎలా చెబుతారు’ అని ఆయన విరుచుకుపడ్డారు.
Similar News
News November 20, 2025
పత్తిని గులాబీ రంగు పురుగు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు

పత్తిని వేసవి పంటగా డిసెంబర్ తర్వాత సాగు చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని తప్పక పాటించాలి. లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు ఉద్ధృతిని గమనిస్తుండాలి. ఎండాకాలంలో లోతు దుక్కులు చేస్తే గులాబీ పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. తక్కువ పంట కాలం రకాలను ఎంచుకొని సకాలంలో విత్తుకోవాలి. పొలం చుట్టూ B.T విత్తనాలతో సహా ఇచ్చిన నాన్ B.T విత్తనాలు విత్తుకోవాలి. ఈ పురుగు ఆశించిన పంట విత్తనాలను నిల్వ చేయకూడదు.
News November 20, 2025
150 పోస్టులకు TCIL నోటిఫికేషన్

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)150 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫారమ్ను tcilksa@tcil.net.inకు, tcilksahr@gmail.com ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tcil.net.in/
News November 20, 2025
పోలి పాడ్యమి: రేపు ఏమేం చేయాలో తెలుసా?

పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, 30 వత్తుల దీపం వెలిగించాలి. దాన్ని అరటి దొప్పలలో పెట్టి పారే నీటిలో వదలాలి. తద్వారా కార్తీక మాస దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి, శివ లింగానికి అభిషేకం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, పోలి స్వర్గం కథ విని, దీపదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.


