News July 25, 2024

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం: ఉత్తమ్

image

TG: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌లో త్వరలో అవకాశం కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అయితే అంతకుముందు విధివిధానాలు, అర్హుల విషయమై మంత్రిమండలిలో చర్చించాల్సి ఉంటుందన్నారు. రేషన్ కార్డుల కోసం ప్రజావాణిలో ఇప్పటి వరకు 1,944 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని మంత్రి తెలిపారు.

Similar News

News January 18, 2026

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

image

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.

News January 18, 2026

రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారింది: మాజీ మంత్రి

image

AP: గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవా వెళ్లేవారని.. ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. MLAలంతా సంపాదనపై పడ్డారని ఆరోపించారు. పేకాట, కోడి పందేలా పేరిట దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా తయారయ్యారని మండిపడ్డారు.

News January 18, 2026

నీటి నిల్వకు ఇంకుడు గుంత ఎక్కడ తవ్వాలి?

image

ఇంకుడు గుంతను ఇంటి బయట ఈశాన్య దిశలో(పిశాచ స్థానంలో) నిర్మించడం వల్ల నీటి ఎద్దడి తప్పుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే, అన్ని సందర్భాల్లో ఈశాన్యంలోనే నీరు పడాలని లేదు కాబట్టి బోరుకు దగ్గరగా ఎక్కడైనా గుంత ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలని, కఠినమైన నియమాల కంటే అవసరానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని అనువైన రీతిలో మార్చుకోవాలని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>