News July 23, 2024
బాలలత సవాలును స్వీకరిస్తున్నా కానీ..: స్మిత సబర్వాల్

<<13681045>>దమ్ముంటే తనతో ఎగ్జామ్ రాయాలంటూ<<>> సివిల్స్ మెంటార్ బాలలత చేసిన సవాలును ఐఏఎస్ స్మిత సబర్వాల్ స్వీకరించారు. అయితే తన వయసు దాటిపోవడంతో యూపీఎస్సీ నిబంధనలు ఒప్పుకోవంటూ ట్వీట్ చేశారు. ‘బాలలత నా ప్రశ్నకు సమాధానమివ్వాలి. మీ దివ్యాంగ రిజర్వేషన్ను ప్రజలకు ఫీల్డ్ వర్క్ కోసం వినియోగించారా లేక కోచింగ్ సంస్థలు నడిపేందుకు వాడారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 14, 2025
ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక తిమ్మక్క కన్నుమూత

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8వేలకు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు.
News November 14, 2025
రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ప్రముఖ బ్రూక్ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.
News November 14, 2025
బీజేపీకి షాక్.. డిపాజిట్ గల్లంతు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.


