News January 17, 2025

ACCIDENT: 9 మంది దుర్మరణం

image

మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.

Similar News

News January 16, 2026

బంగ్లాను దారికి తెచ్చేందుకు జైషా ‘డైరెక్ట్ అటాక్’!

image

T20 వరల్డ్ కప్ విషయంలో మొండికేస్తున్న బంగ్లా బోర్డును దారికి తెచ్చుకునేందుకు ICC కీలక అడుగు వేయనుంది. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ICC ప్రతినిధుల బృందం త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ‘మేం ఇండియాకు రాబోం’ అని బంగ్లా చెప్పినట్లు తెలుస్తోంది. చివరి యత్నంగా ఈ ‘వన్ టు వన్’ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని ICC డిసైడైనట్లు అర్థమవుతోంది.

News January 16, 2026

వంటింటి చిట్కాలు

image

* కప్పు వెనిగర్ లో టేబుల్ స్పూను ఉప్పు కలిపి వేడిచేయాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే రాగి పాత్రలకు పట్టించి చల్లారాక శుభ్రపరిస్తే సరి. కొత్తవాటిలా మెరుస్తాయి. * నిల్వ ఉంచిన మష్రూమ్స్ తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు వాటిని వెల్లుల్లితో కలిపి ఉడికించండి. రంగు మారితే అవి పాడయినట్లు అర్థం. * డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే దరిచేరవు.

News January 16, 2026

కేంద్ర విద్యుత్ సవరణ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ TG నివేదిక

image

TG: కేంద్ర ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు-2025లోని కొన్ని నిబంధనలను TG వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ERCలకు పూర్తి అధికారాలు, విద్యుత్ సబ్సిడీల హేతుబద్ధీకరణ, పరిశ్రమలు నేరుగా విద్యుత్‌ కొనుగోలు వంటి నిబంధనల్ని కేంద్రం ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈమేరకు రెండు డిస్కంలు నివేదికను సిద్ధం చేశాయి. CM అనుమతితో అధికారులు దీన్ని కేంద్రానికి సమర్పించనున్నారు.