News February 22, 2025

SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?

image

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.

Similar News

News November 11, 2025

వేదాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా?

image

వేదాలు అపౌరుషేయాలు. ఇవి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం నుంచి సహజంగా వెలువడినవి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించాలని సంకల్పించగా, ఆయనకు మొదట ‘ఓం’ అనే పవిత్ర ప్రణవనాదం వినిపించింది. బ్రహ్మ ఆ ఓంకార నాదాన్ని ధ్యానంలో గ్రహించి, ఆ పరమశబ్దాన్ని వేదజ్ఞానం రూపంలో మహర్షులు, రుషుల ద్వారా లోకానికి వెలువరించారు. అందుకే వేదాలను సనాతన ధర్మానికి మూలమైన దివ్యజ్ఞానంగా భావిస్తారు. <<-se>>#VedikVibes<<>>

News November 11, 2025

SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

image

SBI 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎఫ్‌పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News November 11, 2025

భవిష్యత్తు బంగారం ‘రాగి’: అనలిస్టులు

image

ఈవీలు, సోలార్ ప్యానెల్స్, 5G టవర్లు, డేటా సెంటర్ల నిర్మాణంలో ఉపయోగించే రాగి విలువ పెరుగుతోందని అనలిస్టులు చెబుతున్నారు. ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఇండోనేషియాలోని కాపర్ మైన్స్ వరదలు, ప్రమాదాలతో షట్‌డౌన్ అంచున ఉన్నాయి. 2026కు 6 లక్షల టన్నుల రాగి కొరత ఏర్పడవచ్చు. కొత్త మైన్స్ తెరిచేందుకు 10-15 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో టన్ను రాగి 11-14 వేల డాలర్లకు చేరుకోవచ్చని చెబుతున్నారు.