News October 16, 2024

అమెరికాలో ప్రమాదం.. ఏపీలో తీవ్ర విషాదం

image

AP: అమెరికాలోని రాండాల్ఫ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు కారులో వెళ్తుండగా సౌత్ బాన్‌హాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వీరితోపాటు మరో ఇద్దరు భారతీయులు కూడా మరణించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 23, 2025

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: CM CBN

image

AP: రాష్ట్రంలో అతిభారీ వర్షాలపై CM CBN దుబాయ్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతికి NDRF, SDRF బృందాలను పంపాలని సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, R&B, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

News October 23, 2025

దీక్షలు విరమించిన PHC వైద్యులు

image

AP: వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌తో PHC వైద్యుల చర్చలు సఫలం అయ్యాయి. PG సీట్లలో 20% ఇన్‌ సర్వీస్‌ కోటా ఈ ఏడాదికి, 15% కోటా వచ్చే ఏడాది ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. తదుపరి ఇన్‌ సర్వీస్‌ కోటా అప్పటి వేకెన్సీల ఆధారంగా నిర్ణయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లు, టైం బౌండ్‌ ప్రమోషన్లపై కూడా సానుకూల స్పందన రావడంతో దీక్షలు విరమిస్తున్నట్లు PHCల వైద్యులు ప్రకటించారు.

News October 23, 2025

జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం: రామ్మోహన్ నాయుడు

image

AP: బంగ్లాదేశ్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించి, అక్కడి నేవీ అధికారులకు చిక్కిన <<18075524>>జాలర్ల<<>>ను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు బాధిత మత్స్యకార కుటుంబాలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిసి ధైర్యం చెప్పారు.