News March 18, 2024
కాకినాడ జిల్లాలో ACCIDENT.. కన్నీటి ఘటన

కిర్లంపూడిలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు <<12873564>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన వెంకటేశ్ (20), హరిసాయి వెంకట్ (20) సామర్లకోటకు పనినిమిత్తం వెళ్లారు. తిరిగి వస్తుండగా రాజుపాలెం శివారులో బొలెరో వాహనం ఢీకొనగా చనిపోయారు. తండ్రి గతంలో చనిపోగా వెంకటేశ్ చిన్న ఉద్యోగం చేస్తూ సోదరి, తల్లిని పోషిస్తూ వస్తున్నాడు. హరిసాయి ఇంటర్ చదవగా ఉద్యోగప్రయత్నంలో ఉన్నాడు.
Similar News
News November 29, 2025
రాజమండ్రి: గోదావరి బాలోత్సవానికి సర్వం సిద్ధం

రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న గోదావరి బాలోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి, గోదావరి బాలోత్సవం ఛైర్మన్ దుర్గేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఈఓ కె. వాసుదేవరావు అతిథులుగా పాల్గొంటారు. జిల్లాలోని 145 పాఠశాలల నుంచి 8 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
News November 28, 2025
పీఎంఏవై గ్రామీణ సర్వే పూర్తి: కలెక్టర్ కీర్తి

పీఎంఏవై గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదల గుర్తింపు గడువు నవంబర్ 30 వరకు ఉండటంతో, జిల్లాలో 16,335 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. గృహనిర్మాణ శాఖ సిబ్బంది ద్వారా ‘ఆవాస్ ప్లస్’ యాప్‌లో సర్వే పూర్తి చేసినట్లు ఆమె ప్రకటించారు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 28, 2025
రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.


