News July 17, 2024
సింగరేణి ఓపెన్ కాస్ట్లో ప్రమాదం.. ఇద్దరు మృతి

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్2లో మట్టిపెళ్లలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పైప్లైన్ లీకేజీని ఆపేందుకు వెళ్లిన నలుగురిపై మట్టి పెళ్లలు కూలాయి. ఆ మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మృతులను ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్గా గుర్తించారు.
Similar News
News September 19, 2025
బతుకమ్మ పండుగ.. ఆకాశం నుంచి పూల వర్షం!

TG: బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 30న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పూలను చల్లి వారికి స్వాగతం పలుకుతారు. 28న LB స్టేడియంలో 20వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 19, 2025
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వివరాలు (1/2)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆరోజు ధ్వజారోహణం నుంచి వేడుకలు మొదలై, అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తాయి. రోజువారి వివరాలివే..
Day 1(sep 24) : బంగారు తిరుచ్చి ఉత్సవం, పెద్దశేష వాహనం.
Day 2(sep 25) : చిన్న శేష వాహనం, హంస వాహనం
Day 3(sep 26) : సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం
News September 19, 2025
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వివరాలు (2/2)

Day 4(sep 27): కల్పవృక్ష వాహనం,సర్వ భూపాల వాహనం
Day 5(sep 28) : మోహినీ అవతారం, గరుడ వాహనం
Day 6(sep 29) : హనుమంత వాహనం, స్వర్ణ రథోత్సవం, గజ వాహనం
Day 7(sep 30) : సూర్య ప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
Day 8(Oct 1) : రథోత్సవం, అశ్వ వాహనం
Day 9(sep 2) : పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం