News July 17, 2024

‘సర్దార్ 2’ సెట్లో ప్రమాదం.. స్టంట్ మ్యాన్ మృతి

image

కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న ‘సర్దార్ 2’ మూవీ సెట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్టంట్ మ్యాన్ ఎజుమలై మరణించారు. చెన్నైలో ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎజుమలై 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. దీంతో ఆయన ఛాతీ భాగంలో తీవ్రగాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 7, 2026

గాయం నుంచి కోలుకొని అదరగొట్టిన శ్రేయస్

image

భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ VHTలో అదరగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నిన్న ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఆయన 53 బంతుల్లోనే 82 రన్స్ చేశారు. అందులో 10 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. దీంతో ఈ నెల 11 నుంచి NZతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో శ్రేయస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమైనట్లే. గతేడాది AUSలో వన్డే మ్యాచ్ ఆడుతూ గాయపడిన శ్రేయస్ 2 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

News January 7, 2026

రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

image

ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.

News January 7, 2026

జనవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం