News April 8, 2024

సీఎం కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం

image

TG: సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ దగ్గర ఒక్కసారిగా ల్యాండ్ క్రూజర్ టైర్ పేలింది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా సీఎం మొయినాబాద్ మీదుగా కొడంగల్ వెళ్లారు.

Similar News

News February 3, 2026

కృష్ణా: ఈ నెల 16 వరకు డిగ్రీ సెమిస్టర్ ఫీజు గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4, 6వ సెమిస్టర్‌కు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులపై వర్సిటీ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఈ నెల 16వ తేదీ లోపు తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. అనంతరం 17వ తేదీ వరకు ప్రిన్సిపల్స్ యూనివర్సిటీ పోర్టల్‌లో ఫీజును జమ చేయాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో 21, 24, 27 తేదీల వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది.

News February 3, 2026

అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్

image

AP: మాజీ CM, YCP అధ్యక్షుడు జగన్ రేపు గుంటూరులో పర్యటించనున్నారు. CM చంద్రబాబుపై అనుచిత వాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ సహా ఆయన కుటుంబాన్ని జగన్ కలవనున్నారు. TDP శ్రేణుల దాడిలో దెబ్బతిన్న రమేశ్ ఇంటిని పరిశీలిస్తారు. ఈ మేరకు YCP MLC తలశిల రఘురామ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

News February 3, 2026

వ్యవసాయంలో అధిక ఆదాయం ఇలా సాధ్యం

image

సాగులో సమీకృత వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. భూమిని భాగాలుగా విభజించి వరి, చిరు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూనే.. కోళ్లు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు, చేపల పెంపకాన్ని చేపట్టడాన్నే సమీకృత వ్యవసాయం అంటారు. దీని వల్ల కొద్దిపాటి భూమిలోనే ఏడాది పొడవునా రైతులు ఆదాయం పొందవచ్చు. దీన్ని ఎలా చేయాలి? ఏ భూములకు అనుకూలమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.