News March 17, 2024

HYD నుంచి మెదక్‌ వెళ్తుంటే యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసి మృతి చెందాడు. నగరం నుంచి మెదక్ వైపు వెళ్తుండగా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో HYD వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 26, 2025

HYD: పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా రావాలని!

image

ప్రాణం విలువ, బంధం విలువ తెలిపే ఫొటో ఇది. అమీర్‌పేట-కృష్ణానగర్ రూట్‌లో కనిపించిన ఈ దృశ్యం ఆలోచింపజేస్తోంది. ఓ వాహనం వెనుక అంటించిన కొటేషన్‌ ఇతర వాహనదారుల వేగాన్ని తగ్గించి, బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓ నారీ దిగాలుగా ఇంటి వద్ద కూర్చొని బయటకి వెళ్లిన తన వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ‘పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా ఇంటికి ఎప్పుడొస్తాడో’ అన్నట్లు ఉంది. ఈ కొటేషన్ అందరి గుండెను హత్తుకుంది.

News October 26, 2025

HYD: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

image

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. HYDలో ఈసారి 80 లిక్కర్ షాపులకు 3201 దరఖాస్తులు వచ్చాయి. సికింద్రాబాద్‌లో 99 షాపులకు 3022 మంది దరఖాస్తు చేశారు. జంటనగరాల నుంచి రూ.186.69 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గ్రేటర్‌ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం. రేపటి లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.

News October 26, 2025

జూబ్లీహిల్స్: సీరియల్ నంబర్లలో 1, 2, 3 కీలకం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీలు, ఇండిపెండెంట్‌లకు ECI పార్టీ గుర్తులు, సీరియల్ నంబర్లను కేటాయించింది. 58 మంది పోటీలో ఉన్నా ముగ్గురే కీలకం కానున్నారు. సీరియల్ నంబర్ 1లో BJP, నంబర్ 2లో కాంగ్రెస్, నంబర్ 3లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లకు స్పష్టంగా తెలిసేలా ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ప్రదర్శిస్తున్నారు.