News October 13, 2025
రూల్ ప్రకారం.. ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చు?

దేశంలో బంగారం కొనుగోళ్లను పర్యవేక్షించే ఆదాయ పన్ను శాఖ రైడ్స్ సమయంలో సరైన పత్రాలు చూపిస్తే ఎంత బంగారమైనా ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే పత్రాలు లేకున్నా పౌరుల వద్ద కొంతమొత్తంలో బంగారం ఉండేందుకు అనుమతి ఉంది. పెళ్లికాని మహిళలు: 250గ్రా, పెళ్లైన మహిళలు: 500గ్రా. పురుషులు: 100గ్రా. పసిడి కలిగి ఉండొచ్చు. వీటికి వారసత్వంగా, పెళ్లితో కానుకగా వచ్చిన గోల్డ్ అదనంగా ఉంటే అందుకు తగిన డాక్యుమెంట్స్ చూపాలి.
Similar News
News October 13, 2025
ఫిట్‌నెస్‌కి సారా టిప్స్ ఇవే..

ప్రస్తుతకాలంలో వివిధ కారణాల వల్ల బరువు పెరిగేవారి సంఖ్య పెరిగింది. సారాఆలీఖాన్ కూడా మొదట్లో ఆ బాధితురాలే. ఒకప్పుడు బరువుగా ఉండే ఈమె ప్రస్తుతం ఎంతో ఫిట్‌గా మారారు. దీనికోసం ఎక్కువగా లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకున్నానని సారా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రెగ్యులర్ యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడం, ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు తగినంత నిద్రపోవడం కూడా తన ఆరోగ్యానికి కారణమంటున్నారామె.
News October 13, 2025
అమరావతి పనులను పరుగులు పెట్టించాలి: CBN

AP: గడువులోగా అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. పనుల్ని పరుగులు పెట్టించాలని సమీక్షలో సూచించారు. ‘పనులు ఆలస్యం లేకుండా నిర్మాణ ప్రాంతాల వద్దనే మౌలిక సదుపాయాలు కల్పించాలి. వర్షాకాలంలో ఆటంకం అయినా ఇప్పుడు స్పీడ్ పెంచండి. నిధులకు సమస్య లేదు. ఆర్థిక శాఖకు కూడా చెప్పాను’ అని వివరించారు. అమరావతికి గట్టి పునాది పడిందని, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు.
News October 13, 2025
ఉల్లి ఆధారిత ఉత్పత్తులు ఇవే..

* ఆనియర్ ఫ్లేక్స్: ఉల్లిపాయలను ముక్కలుగా కోసి వేయించడం/ఎండబెట్టడం ద్వారా ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్లేక్స్ తయారుచేస్తారు. వీటిని సూప్‌లు, కూరల్లో ఉపయోగిస్తారు.
* ఉల్లి పొడి/పేస్ట్: ఎండిన ఉల్లిపాయలను పౌడర్‌గా చేసి, వంటలు, సూప్‌లు, సాస్‌లలో వాడొచ్చు. పేస్టునూ ఉపయోగించవచ్చు.
ఉల్లి నూనె: జుట్టు సమస్యల నివారణకు ఉల్లినూనెకు డిమాండ్ ఉంది.
* ఇలాంటి విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులకు లాభాలు చేకూర్చవచ్చు.