News December 23, 2024
సన్నీలియోన్ పేరిట అకౌంట్.. నెలకు రూ.1000

నటి సన్నీలియోన్ పేరిట అకౌంట్ క్రియేట్ చేసిన ప్రబుద్ధుడు నెలనెలా రూ.1000 పొందుతున్నాడు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పెళ్లైన మహిళలకు ‘మహతారి వందన్ యోజన’ పేరుతో ప్రతి నెలా అకౌంట్లో రూ.వెయ్యి జమ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వీరేందర్ జోషి ఫేక్ ఖాతాతో మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ పథకంలో 50% ఫేక్ అకౌంట్లు ఉన్నాయని BJP సర్కారుపై కాంగ్రెస్ విమర్శించింది.
Similar News
News November 22, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులు

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్సైట్: cdri.res.in
News November 22, 2025
నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>
News November 22, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


