News December 25, 2024
అక్రిడేషన్ గడువు మరో 3 నెలలు పొడిగింపు

TG: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులిచ్చింది. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనుండగా, జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు అక్రిడేషన్లు పనిచేస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు అధికారులు తెలియజేశారు.
Similar News
News November 23, 2025
29న కాకినాడ జిల్లాకు పవన్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంతో పాటు కాకినాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్‌పై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.
News November 23, 2025
పిల్లలు బరువు తగ్గుతున్నారా?

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.


