News April 18, 2024
సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుల అరెస్ట్?
AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు జగన్‌పై సతీశ్ దాడి చేసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. అతడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు భావిస్తున్నారు. వీరి అరెస్టుపై పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది. మరికాసేపట్లో పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.
Similar News
News November 18, 2024
మరో 500 SBI బ్రాంచీలు: నిర్మల
FY25 చివరికి మరో 500 SBI బ్రాంచీలను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆ సంఖ్య 23,000లకు చేరుకుంటుందని తెలిపారు. దేశంలో SBIకి 50crకు పైగా కస్టమర్లు ఉన్నారని, మొత్తం డిపాజిట్లలో 22.4% వాటా ఉందని చెప్పారు. రోజుకు 20cr UPI లావాదేవీలను నిర్వహిస్తోందన్నారు. ముంబైలోని SBI ప్రధాన కార్యాలయం వందో వార్షికోత్సవం సందర్భంగా రూ.100 స్మారక నాణెంను ఆమె ఆవిష్కరించారు.
News November 18, 2024
గుడ్‌న్యూస్: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి <
News November 18, 2024
అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR
TG: రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అని KTR ట్వీట్ చేశారు.