News April 5, 2025
రంగరాజన్‌పై దాడి కేసు నిందితుడికి బెయిల్

TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి HYD రాజేంద్ర నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో వీరరాఘవను మొయినాబాద్ పోలీసులు ఫిబ్రవరి 8న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఇతను హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు.
Similar News
News April 5, 2025
PBKSvsRR: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205/4 స్కోర్ చేసింది. జైస్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43*, నితీశ్ రాణా 12, హెట్‌మయర్ 20 పరుగులు చేశారు. ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్‌సెన్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 206 రన్స్ చేయాలి.
News April 5, 2025
1996 WC విన్నింగ్ క్రికెటర్లతో మోదీ భేటీ

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి లెజెండరీ క్రికెటర్లతో సమావేశమయ్యారు. 1996 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులైన జయసూర్య, అరవింద డిసిల్వా సహా పలువురు ప్లేయర్లతో ముచ్చటించారు. అలాగే 1987-90 మధ్య శ్రీలంక శాంతి, సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(IPKF) స్మారకం(కొలంబో) వద్ద నివాళులర్పించారు. ఆ సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ట్వీట్ చేశారు.
News April 5, 2025
ట్రంప్‌ను చూసి భారత్ నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్

ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న పన్నులను చూసి భారత్ నేర్చుకోవాలని SP అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కాపాడుకోవాలంటే దిగుమతులపై అధిక పన్నులు వేయాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. పేదల తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. గోరఖ్‌పూర్, అయోధ్యలో ఉన్న వక్ఫ్ భూములను కాజేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.