News April 2, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో జుడీషియల్ రిమాండ్‌కు నిందితులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిద్దరికి ఈ నెల 6వరకు రిమాండ్ విధించింది. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.
Similar News
News February 12, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 18పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా(EE), ITI, టెన్త్, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్&రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hindustancopper.com/
News February 12, 2026
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్!

ఎయిర్‌ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా భారత్ రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు రాజ్‌నాథ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇండియాకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ సత్తా చాటిన విషయం తెలిసిందే.
News February 12, 2026
కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుస భేటీలు

ఢిల్లీ పర్యటనలో CM రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడును కోరారు. కొత్తగూడెం, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి చర్చలు జరిపారు. అశ్వినీ వైష్ణవ్, రాజ్‌నాథ్ సింగ్‌తోనూ CM సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలని రాజ్‌నాథ్‌ను ఆహ్వానించారు.


