News February 5, 2025
Ace pro EV: విప్లవాత్మక లాస్ట్-మైల్ డెలివరీ

టాటా మోటార్స్ Ace Pro EV ని పరిచయం చేసింది, ఇది సమర్థవంతమైన లాస్ట్-మైల్ డెలివరీ కోసం రూపొందించిన అద్భుతమైన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం. 155+ కి.మీ. పరిధి, 750 కిలోల బెస్ట్-ఇన్-క్లాస్ పేలోడ్ మరియు ADAS తో సహా అధునాతన భద్రతా లక్షణాలు కలవు. స్మార్ట్ కనెక్టివిటీ, మల్టిపుల్ బాడీ కాన్ఫిగరేషన్లతో, జీరో ఎమిషన్స్ ను కొనసాగిస్తూ లాభదాయకత పెంచుతుందని వినియోగదారులకు మాటిస్తోంది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


