News July 21, 2024
ఆచార్య దేవోభవ!
మన జీవితాల్లో వెలుగును నింపే గురువులను స్మరించుకునేందుకే ఈ గురుపౌర్ణమి జరుపుకుంటారు. కురుక్షేత్రంలో పోరాడేందుకు అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు, మౌర్య రాజ్య స్థాపనలో చంద్రగుప్తుడికి చాణక్యుడు అండగా నిలిచినట్టు మనందరి జీవితాల్లోనూ అలాంటి గురువులు ఉంటారు. అది అమ్మానాన్న/ స్నేహితులు కూడా కావొచ్చు. మరి ఈ గురుపూర్ణిమ సందర్భంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన గురువులు ఎవరు? కామెంట్ చేయండి.
Similar News
News December 21, 2024
నేను రోడ్ షో చేయలేదు: అల్లు అర్జున్
‘పుష్ప2’ ప్రీమియర్కు సంధ్య థియేటర్ వద్ద తాను రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ తెలిపారు. తన కోసం ఎదురుచూస్తున్న వేలాది ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చేయి మాత్రమే చూపించానన్నారు. అనంతరం కాసేపు సినిమా చూసి వెళ్లిన తనకు తొక్కిసలాటపై మరుసటి రోజే తెలిసిందన్నారు. రేవతి మృతి గురించి తెలిసి ఆస్పత్రికి బయల్దేరినా, కేసు నమోదవడంతో వెళ్లొద్దని పోలీసులు, సన్నిహితులు చెప్పారని అల్లు అర్జున్ వెల్లడించారు.
News December 21, 2024
తొక్కిసలాట దురదృష్టకర ఘటన: అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఘటనలో ఎవరి తప్పూ లేదని ప్రెస్మీట్లో చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తాను ప్రెస్మీట్ పెట్టలేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం గురించి దుష్ప్రచారం చేస్తుండటం బాధిస్తోందన్నారు.
News December 21, 2024
అల్లు అర్జున్ ప్రెస్మీట్ ఆలస్యం.. కొనసాగుతున్న ఉత్కంఠ
అల్లు అర్జున్ ప్రెస్మీట్ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. రా.7 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని ప్రెస్కు సమాచారం ఇవ్వడంతో అంతా ఆయన ఇంటి వద్ద వేచి చూస్తున్నారు. కానీ రా.8 గంటలు కావొస్తున్నా అర్జున్ ఇంకా బయటికి రాకపోవడంతో మీడియా ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు కూడా బన్నీ ప్రెస్మీట్ ఎప్పుడు ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.