News August 2, 2024
డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటిస్తా: విజయ్ ఆంటోనీ

తనపై వచ్చే రూమర్స్ను పట్టించుకోనని హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. తుఫాన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాలో మాట్లాడారు. డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారని జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘టాలీవుడ్ మూవీల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ప్రాజెక్టు ఖరారుకాలేదు’ అని చెప్పారు. తుఫాన్ తమిళ్ వెర్షన్ ఇవాళ విడుదల కానుండగా, తెలుగులో ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


