News June 19, 2024

‘గజిని’లో నటించడం చెత్త నిర్ణయం: నయనతార

image

‘గజిని’ సినిమాలో నటించడం తన జీవితంలోనే ఒక చెత్త నిర్ణయమని స్టార్ హీరోయిన్ నయనతార అన్నారు. ‘‘గజిని’ సినిమాలో ముందు అనుకున్న విధంగా నా పాత్రను తెరకెక్కించలేదు. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటినే గుణపాఠంగా స్వీకరిస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా సూర్య, అసిన్ జంటగా తెరకెక్కిన ‘గజిని’ మూవీ 2005లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో నయనతార కీలకపాత్ర పోషించారు.

Similar News

News January 18, 2025

రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్‌శర్మ

image

ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. CT జట్టు ప్రకటన సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొద్దిరోజుల క్రితం హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నారు. కాగా 2015లో చివరిసారి అతడు రంజీట్రోఫీలో ఆడారు.

News January 18, 2025

భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?

image

ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్‌లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.

News January 18, 2025

ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?

image

అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్‌ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.