News April 1, 2024
నా బయోపిక్‌లో నటిస్తున్నా: యువరాజ్ ట్వీట్

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నటుడిగా మారుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘నా సొంత బయోపిక్‌లో నటించాలని నిర్ణయించుకున్నా. దర్శకుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్‌గా మారబోతున్నా. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. రాబోయే కొన్నేళ్లలో బిగ్ స్క్రీన్‌పై తుది ఫలితాన్ని చూస్తారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తా’ అని తెలిపారు. అయితే, యూవీ ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News February 2, 2026
టూరిస్ట్ స్పాట్‌గా డంప్‌యార్డ్.. ఎలా మారింది?

రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు SMలో సెన్సేషన్‌గా మారింది. ‘రాజస్థాన్ స్విట్జర్లాండ్’గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి మార్బుల్ వ్యర్థాల డంప్‌యార్డ్. మార్బుల్ కటింగ్ నుంచి వచ్చే తెల్లటి పౌడర్ కొండల్లా పేరుకుపోయి వర్షపు నీరు చేరడంతో అచ్చం మంచు కొండల మధ్య నీటి సరస్సులా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇన్‌స్టా రీల్స్, సినిమా షూటింగ్స్‌కి అడ్డాగా మారింది. ఈ డస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం.
News February 2, 2026
ఫైనల్లో భారత్ ఎదురైతే.. పాక్‌కు మాజీల ప్రశ్న!

T20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు. ‘ఫస్ట్ మ్యాచ్ బాయ్‌కాట్ సరే.. మరి ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు ఆడకుండానే కప్పు వారికిచ్చేస్తారా?’ అని దానిశ్ కనేరియా ప్రశ్నించారు. ఇది పాక్ భయపడుతోందనే సంకేతం ఇస్తుందని విమర్శించారు. మరోవైపు ‘క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భారత్‌తో ఆడకపోవడం బాధాకరమని అఫ్రీది అభిప్రాయపడ్డారు.
News February 2, 2026
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదు: సజ్జల

AP: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, బందిపోట్ల మాదిరి TDP తమ నేతల ఇళ్లపై దాడులు చేస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌ల ఆదేశాలతో అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై పోలీసుల సమక్షంలోనే గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. లడ్డూ అంశంలో దొరికిపోవడంతో CBN ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక CBNకి రిటర్న్ గిఫ్ట్ తప్పని సరిగా ఇస్తామని హెచ్చరించారు.


