News June 19, 2024
రాజధాని సామగ్రి దొంగలపై చర్యలు: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు. ‘కేబినెట్లో చర్చించాక రాజధాని పనులు ప్రారంభిస్తాం. టెండర్లకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. కొత్త అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాల్సి ఉంది. రేపు అమరావతిలో చంద్రబాబు పర్యటన అనంతరం పనులపై చర్చించనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.
News November 22, 2025
బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.
News November 22, 2025
హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.


