News September 22, 2024

లడ్డూను అపవిత్రం చేసిన వారిపై చర్యలు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూ అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని TTD ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘ప్రస్తుతం నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475కు కొంటున్నాం. దోషాలను తొలగించడానికి ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించాం. అనుభవజ్ఞులైన 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే తిరుమలలో FSSL ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 23, 2024

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, సూర్యాపేటలో మోస్తరు వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 23, 2024

మెగాస్టార్‌కు రాజమౌళి అభినందనలు

image

మెగాస్టార్ చిరంజీవికి దర్శక ధీరుడు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. తన కెరీర్‌లో 24 వేల డాన్స్ మూవ్స్ చేశారని ఇప్పుడే చదివినట్లు ట్వీట్ చేశారు. 46 ఏళ్ల అసాధారణ ప్రయాణం అద్భుతమని కొనియాడారు. భారత చిత్ర సీమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటుడిగా గిన్నిస్ రికార్డు సాధించినందుకు కంగ్రాట్స్ తెలిపారు.

News September 23, 2024

వారికే జిల్లా అధ్యక్ష పదవులు: సీఎం రేవంత్

image

TG: బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ వేస్తామన్నారు. సుప్రీం తీర్పును అధ్యయనం చేస్తూ సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని సూచించారు. జమిలి ఎన్నికల అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.