News April 25, 2024

ఏపీ సీఎస్‌పై చర్యలు తీసుకోవాలి: కోటంరెడ్డి

image

AP: సీఎస్ జవహర్‌రెడ్డిపై EC చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల విధులు చూడాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ <<13110732>>సీతారామాంజనేయులు <<>>గతంలో నాకు ఫోన్ చేసి పరోక్షంగా బెదిరించారు. పెన్షన్లపై ఈసీ ఆదేశాలను సీఎస్ సరిగా అమలు చేయలేదు. జవహర్ రెడ్డిని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి. వైసీపీని వీడాక నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు’ అని ఆరోపించారు.

Similar News

News September 16, 2025

భూమికి సమీపంగా భారీ ఆస్టరాయిడ్

image

ఓ భారీ గ్రహశకలం త్వరలో భూమికి సమీపంగా రానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2025 FA22 అనే ఆస్టరాయిడ్‌ సెప్టెంబర్ 18 ఉ.8.33 గం.కు భూమికి అత్యంత సమీపంలోకి రానుందని చెబుతున్నారు. అప్పుడు ఇది భూమికి 8,41,988 కి.మీ. దూరంలోనే ప్రయాణించనుంది. అయితే ఆ శకలం గురుత్వాకర్షణ పరిధిలోకి రాదని అంటున్నారు. దీని చుట్టుకొలత 163.88 మీ., పొడవు 280 మీ.గా ఉంది. నాసా దీని కదలికలను పరిశీలిస్తోంది.

News September 16, 2025

అనంత్ అంబానీ ‘వనతారా’కు సిట్ క్లీన్ చిట్

image

అనంత్ అంబానీ గుజరాత్‌లో స్థాపించిన ‘వనతారా’ జంతు సంరక్షణ కేంద్రానికి SCలో ఊరట లభించింది. వనతారాకు విదేశాల నుంచి ఏనుగుల తరలింపుపై దాఖలైన పిల్‌ను విచారించి కొట్టేసింది. సిట్ వనతారాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఏనుగులను తరలిస్తే అందులో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. ఏనుగులను యజమానులకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

News September 16, 2025

నేడు భారీ వర్షాలు

image

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అటు TGలో వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని IMD తెలిపింది.