News July 16, 2024
ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

TG: పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ దృష్టికి తీసుకొచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రొటోకాల్ వివాదంపై పార్టీ నేతలతో కలిసి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. 10 మంది MLAలు, ఆరుగురు MLCలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ వీటిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇదే కాంగ్రెస్ హరియాణాలో ఫిరాయింపులపై పోరాడుతోందని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
ప.గో: ఆన్లైన్లో పందెంకోళ్లు

సంక్రాంతి సమీపించడంతో కోడిపుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. బైక్లు, గృహోపకరణాల తరహాలోనే.. సోషల్ మీడియా వేదికగా పుంజుల ఫొటోలు, వీడియోలు, జాతి, బరువు వంటి వివరాలను పోస్ట్ చేస్తూ విక్రేతలు ఆకర్షిస్తున్నారు. పాలకొల్లులో రహదారుల పక్కన విక్రయాలు సాగుతుండగా.. దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. జాతి, సైజును బట్టి ఒక్కో కోడి రూ.1500 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు.
News November 25, 2025
ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>
News November 25, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>


