News June 5, 2024

తప్పు చేసిన వారిపై చర్యలుంటాయ్: లోకేశ్

image

AP: ప్రభుత్వంలో తన పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారని నారా లోకేశ్ చెప్పారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. వైసీపీ చేసిన తప్పులు చేయకుండా రాష్ట్రాన్ని దారిలో పెడతామన్నారు. ఆస్తుల ధ్వంసం, వేధింపులు, దొంగ కేసులు పెట్టడం తమకు తెలియదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన, తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని అడుగుతామన్నారు.

Similar News

News September 17, 2025

రాష్ట్ర‌వ్యాప్తంగా IT అధికారుల సోదాలు

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్‌లోనూ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

News September 17, 2025

రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్‌లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్‌ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

News September 17, 2025

మైథాలజీ క్విజ్ – 8

image

1. రామాయణంలో మైథిలి అంటే ఎవరు?
2. కురుక్షేత్రంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ఎవరు?
3. ‘పుతనా’ రాక్షసిని చంపింది ఎవరు?
4. విష్ణువు శయనించే పాము పేరు ఏమిటి?
5. ‘బృహదీశ్వర ఆలయం’ ఎక్కడ ఉంది?
వీటి ఆన్సర్స్ మైథాలజీ క్విజ్-9 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17714352>>మైథాలజీ క్విజ్ – 7<<>> జవాబులు: 1.జయవిజయులు 2.సరయు 3.దేవవ్రతుడు 4.ఉత్తరాఖండ్ 5.వినాయక చవితి