News December 22, 2024

ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు: బన్నీ వార్నింగ్

image

తన అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’ అని కోరారు. కాగా, బన్నీ అరెస్టు తర్వాత సీఎంపై అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి.

Similar News

News December 22, 2024

ట్రెండింగ్‌లో #StopCheapPoliticsOnAA

image

తొక్కిసలాట ఘటనను కారణంగా చూపిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని SMలో ఆయన అభిమానులు తప్పుబడుతున్నారు. కావాలనే AAను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని పోస్టులు చేస్తున్నారు. దిష్టి బొమ్మ దహనం, ఇంటిపై దాడి అందులో భాగమేనని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా బన్నీని లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని కోరుతున్నారు. ఈ క్రమంలో #StopCheapPoliticsOnALLUARJUN ను ట్రెండ్ చేస్తున్నారు.

News December 22, 2024

రూ.5,000 కోట్లతో జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి

image

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ నెల 28న తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్‌ను ఆయన వివాహమాడతారు. ఈ వేడుకను రూ.5,000 (600 మిలియన్ల డాలర్లు) కోట్ల ఖర్చుతో కొలరాడోలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తారని సమాచారం. కాగా బెజోస్ గతంలో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.

News December 22, 2024

మనవడి రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు

image

నారా వారసుడు దేవాన్ష్ <<14952633>>ప్రపంచ రికార్డు<<>> సృష్టించడంతో తాత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Xలో సంతోషం వ్యక్తం చేశారు. కృషి, పట్టుదల, అంకితభావం విజయానికి కీలకమని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొన్ని నెలలుగా దేవాన్ష్ పడిన కష్టాన్ని చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాన్ష్‌ నిబద్ధత కళ్లారా చూశామని, ఈ ఘనత అందుకోవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు లోకేశ్, బ్రహ్మణి ట్వీట్ చేశారు.