News August 24, 2025
త్వరలోనే బాధ్యులపై చర్యలు: మంత్రి రాంప్రసాద్

AP: ‘ఆడుదాం ఆంధ్రా’పై విచారణ పూర్తయిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో అందరూ సమానమే అని పేర్కొన్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
Similar News
News August 25, 2025
DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మార్పు

AP: 16,347 DSC పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారినట్లు మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తొలుత సోమవారం వెరిఫికేషన్ నిర్వహించాలని భావించినా పలు కారణాలతో మంగళ, బుధవారాల్లో చేపట్టనున్నట్లు వివరించారు. ఆన్‌లైన్ అప్లికేషన్లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమంలోనే CV నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 22న మెరిట్ లిస్ట్ రిలీజైన విషయం తెలిసిందే.
News August 24, 2025
భారత్ నిబంధనలకు లోబడే STARLINK సేవలు

ఎలాన్ మస్క్ STARLINKకు భారత్‌లో ఇంటర్నెట్ సేవలందించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యునికేషన్స్ నుంచి అనుమతి లభించింది. మన నిబంధనలకు లోబడే సేవలు అందించనున్నారు. అంటే భారతీయ వినియోగదారుల డేటాను విదేశాల్లో కాపీ, డీక్రిప్టింగ్ చేయకూడదు. విదేశాల్లోని సిస్టమ్స్‌లో ఇండియన్స్ ట్రాఫిక్ డీటెయిల్స్ మిర్రరింగ్ కాకూడదు. ఇండియాలో ఎర్త్ స్టేషన్ గేట్‌వేస్ నిర్మించడానికి కూడా సంస్థ అంగీకరించిందని అధికారులు తెలిపారు.
News August 24, 2025
‘రహస్య మీటింగ్’ ప్రచారమే: రాజగోపాల్

TG: 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించాననే ప్రచారం అబద్ధమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. CM రేవంత్‌తో అంతర్గత సమస్యలున్నా చీలిక ఆలోచన తనలో లేదన్నారు. విభేదాలున్న ఈ సమయంలో సన్నిహిత ఎమ్మెల్యేలు క్యాజువల్‌గా తనను కలవడంతో భేటీగా పొరబడ్డారని వివరించారు. కాగా CMపై ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మునుగోడు MLA సీక్రెట్ మీట్‌పై మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.