News January 8, 2025
విచారణకు సహకరించకపోతే చర్యలు తప్పవు: KTR నోటీసులో ACB

TG: విచారణకు న్యాయవాదిని అనుమతించడం కుదరదని KTRకు ఇచ్చిన 2వ నోటీసులో ACB పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధం. లాయర్‌ను అనుమతించలేదనే సాకుతో విచారణ తప్పించుకుంటున్నారు. విచారణ తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది చెబుతాం. వాటిని సమర్పించేందుకు సమయం ఇస్తాం. విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవు’ అని పేర్కొంది.
Similar News
News December 19, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) 11 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. జీతం నెలకు రూ.60,000-రూ.70,000వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.ugc.gov.in
News December 19, 2025
వరద జలాలపై హక్కు ఏపీదే: రామానాయుడు

ఏటా 4వేల TMCల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని మంత్రి రామానాయుడు ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. ‘వరద జలాలపై హక్కు కింది రాష్ట్రంగా APకే ఉంటుంది. పోలవరంపై 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా రద్దు చేయాలి. కెనాల్ల సామర్థ్యం 17వేల క్యూసెక్కులకు పెంచి ఆ అదనపు వ్యయాన్ని ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలి. గోదావరి జలాలపై ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి’ అని కేంద్రాన్ని కోరారు.
News December 19, 2025
ఆసీస్ భారీ ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు మరో ఓటమి తప్పదా?

యాషెస్ సిరీస్ మూడో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 271-4 పరుగులు చేసింది. ప్రస్తుతం 356 పరుగుల లీడ్‌లో ఉంది. ట్రావిస్ హెడ్ (142), అలెక్స్ కేరీ(52) క్రీజులో ఉన్నారు. జోష్ టంగ్ 2, విల్ జాక్స్, కార్స్ తలో వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ఇప్పటికే వరుసగా 2 టెస్టులు ఓడింది.


