News October 26, 2024

వ్యర్థాలను తొలగించని బిల్డర్లపై చర్యలు: హైడ్రా

image

TG: హైడ్రా కూల్చిన తర్వాత భవన వ్యర్థాలను తొలగించే బాధ్యత సంబంధిత బిల్డర్లదేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. వాటిని తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చం. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది చెరువులు, నాలాల్లో చేపట్టిన నిర్మాణాలనే కూల్చుతాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 27, 2024

మా పౌరులను వదిలేస్తే యుద్ధం ఆపేస్తాం: ఇజ్రాయెల్

image

బందీలుగా పట్టుకున్న తమ పౌరులను హమాస్ వదిలేస్తే తాము యుద్ధం ఆపేయడానికి సిద్ధమని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. గాజాలో స్థిరత్వానికి తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ‘కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఎప్పుడూ సిద్ధమే. కానీ ముందుగా హమాస్ ఆయుధాలను పక్కన పెట్టాలి. బందీలను వదిలేయాలి. భద్రతామండలి తీర్మానాల్ని గాజాలో అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.

News October 27, 2024

రాజా సాబ్‌ను ఢీకొట్టనున్న థగ్ లైఫ్?

image

రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ప్రభాస్‌లాంటి మాస్ హీరో సినిమా వస్తోందంటే ఆ డేట్‌కి వేరే సినిమా రిలీజెస్ సాధారణంగా ఉండవు. కానీ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీని అదే డేట్‌కు తీసుకురావాలని భావిస్తున్నట్లు కోలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి. రాజాసాబ్‌తో తమిళనాట తమకు ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నట్లు సమాచారం.

News October 27, 2024

దక్షిణ కొరియాకు ‘ఒంటరి మరణాల’ సమస్య

image

దక్షిణ కొరియాలో భారీగా పెరుగుతున్న ‘ఒంటరి మరణాలు’ ఆ ప్రభుత్వానికి ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒంటరితనంతో బాధపడుతున్న వేలాదిమంది నడి వయసు పురుషులు తమవారికి తెలియకుండా ఒంటరిగా మరణిస్తున్నారు. ఈ తరహా మరణాలు గత ఏడాది 3661 నమోదయ్యాయి. ఈ సమస్యని చక్కదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో 327 మిలియన్ డాలర్ల విలువైన చర్యలు తీసుకోవాలని సియోల్ నిర్ణయించింది. ఇప్పటికే పౌరులకోసం 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.