News August 27, 2024
నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై చర్యలు: CM రేవంత్

TG: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. పెరుగుతున్న వైరల్ జ్వరాల కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.


