News November 21, 2024
PCB నివేదిక రాగానే చర్యలు: పవన్

AP: విశాఖలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనమండలిలో ఎయిర్ పొల్యూషన్పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘కాలుష్య తీవ్రత, నివారణపై PCB అధ్యయనం చేస్తోంది. జనవరి నాటికి రిపోర్టు ప్రభుత్వానికి అందుతుంది. రాగానే కాలుష్య నివారణ కార్యాచరణకు చర్యలు తీసుకుంటాం. పర్యావరణ క్షీణత కాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం’ అని పవన్ వెల్లడించారు.
Similar News
News December 5, 2025
దోస్త్ మేరా దోస్త్

మన దేశంలో ప్రభుత్వాలు మారినా రష్యాతో సంబంధాలు మాత్రం అలాగే ఉన్నాయి. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా పాక్కు సపోర్ట్ చేసింది. అయితే సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) భారత్ వైపు నిలబడింది. బంగాళాఖాతంలో సబ్మెరైన్తో మోహరించగానే అమెరికా సైన్యం భయపడి వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఆ యుద్ధంలో భారత్ గెలిచింది. మనం వాడుతున్న యుద్ధవిమానాల్లో 80% రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం విశేషం.
News December 5, 2025
చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.
News December 5, 2025
ప్లాస్టిక్తో హార్మోన్ల అసమతుల్యత

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


