News October 12, 2024
కాలేజీలు బంద్ చేస్తే చర్యలు: రిజిస్ట్రార్ హెచ్చరిక

TG: ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తే చర్యలు తప్పవని OU రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాలేదని పలు కాలేజీల యాజమాన్యాలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించడంతో ఆయన స్పందించారు. డిగ్రీ, పీజీ అకడమిక్ సెమిస్టర్ పరీక్షలు, గ్రూప్-1,2,3 ఉద్యోగాలు, ఇతర రాత పరీక్షలు ఉన్నందున కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారని చెప్పారు.
Similar News
News December 27, 2025
జనవరి 3, 4, 5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు

AP: జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా, 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. NTR పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.
News December 27, 2025
వందలోపే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ది యాషెస్ సిరీస్ ఫోర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై పట్టు కోసం ఇంగ్లండ్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 152 రన్స్కే ఆలౌటైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ టైంకి 98/6(140 లీడ్) రన్స్ చేసింది. హెడ్(46) ఫర్వాలేదు అనిపించారు. ENG బౌలర్లలో కార్స్, జోష్ చెరో 2 వికెట్లు, అట్కిన్సన్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు. స్మిత్(16*), గ్రీన్(6*) బ్యాటింగ్ చేస్తున్నారు.
News December 27, 2025
ఈ ఫ్రూట్తో మహిళలకు ఎన్నో లాభాలు

శీతాకాలంలో ఎక్కువగా లభించే వాటర్ చెస్ట్నట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, జీర్ణ సమస్యలు, బరువు తగ్గించడం, పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో పనిచేస్తుందంటున్నారు. అలాగే గుండె, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయంటున్నారు.


