News March 27, 2024
అలా చేస్తే చర్యలు తప్పవు: నాగబాబు

అభ్యర్థుల ఎంపికలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే ఫైనల్ అని ఆ పార్టీ అగ్రనేత నాగబాబు వ్యాఖ్యానించారు. ‘అభ్యర్థుల విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించాకే పవన్ ఓ నిర్ణయానికి వస్తారు. ఈ సంగతి కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తాం. క్రమశిక్షణ చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు.
Similar News
News April 13, 2026
ఈ నెల 30 దాకా రేషన్ పంపిణీ!

TG: 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్ సమస్యలు, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం, స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
News April 13, 2026
నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
News April 13, 2026
5 కేజీల సిలిండర్ల సరఫరా పెంపు

గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి 13 లక్షలకు పైగా సిలిండర్లను అమ్మింది. ప్రస్తుతం రోజువారీ సేల్స్ లక్ష యూనిట్లను దాటాయి. ఎక్కువగా వలస కార్మికులు వీటిని కొంటున్నారు. మరోవైపు మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. డొమెస్టిక్ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11న 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.


