News December 31, 2024
18 నెలల్లో 55 కిలోల బరువు తగ్గిన నటుడు

ఒకసారి బరువు పెరిగిన తర్వాత తగ్గడం చాలా కష్టం. 5-10 కిలోలు తగ్గితే గొప్ప. అలాంటిది నటుడు రామ్ కపూర్ ఏకంగా 55 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన రెండు మిర్రర్ సెల్ఫీలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఓ దాంట్లో భారీ శరీరంతో ఉండగా మరోదాంట్లో సన్నగా ఫిట్గా కనిపించారు. మొత్తం 18 నెలల్లో ఆయన ఇలా మారారు. దీనికోసం ఆయన ఎలాంటి మెడిసిన్ వాడలేదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేసి సన్నబడ్డారు.
Similar News
News December 4, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (<
News December 4, 2025
తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.


