News September 25, 2024

నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. పవన్‌ను ఉద్దేశించేనా?

image

‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో’ అని నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘లడ్డూ మ్యాటర్ సెన్సిటివ్ టాపిక్’ అంటూ తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై పవన్ నిన్న ఫైరయ్యారు. దీంతో కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

Similar News

News October 16, 2025

BREAKING: ఏపీకి చేరుకున్న ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు మోదీకి పుష్పగుచ్ఛాలు అందజేసి వెల్‌కమ్ చెప్పారు. ప్రధాని అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు.

News October 16, 2025

LSG స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ‘కేన్ మామ’?

image

SRH తరఫున తన బ్యాటింగ్‌తో అలరించిన కేన్ విలియమ్సన్ కొత్త అవతారం ఎత్తనున్నారు. పంత్ సారథ్యం వహిస్తున్న LSGకి స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఎంపికయ్యే ఛాన్సుంది. LSG జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి జహీర్ ఖాన్ తప్పుకున్నట్లు తెలియగా, ఆ స్థానాన్ని కేన్ రూపంలో భర్తీ చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. రానున్న మినీ ఆక్షన్‌లో కేన్ మామ సేవలను ఉపయోగించుకోవాలని LSG భావిస్తోంది.

News October 16, 2025

లాభాల్లో మొదలైన మార్కెట్లు

image

వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు గ్రీన్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 342 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బెల్, టైటాన్, మహీంద్రా&మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఎటర్నల్, టాటా మోటార్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉండగా ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.