News October 11, 2025
గాంధీపై నటుడి అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు

ఇటీవల మహాత్మా గాంధీపై <<17936155>>అసభ్యకర వ్యాఖ్యలు<<>> చేసిన టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్‌పై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని వ్యక్తిగతంగా దూషించారని, నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. దేశం గర్వించే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News October 11, 2025
ఇండియన్ కోస్డ్‌గార్డ్‌లో ఉద్యోగాలు..

ఇండియన్ కోస్ట్‌గార్డ్ 22 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 11వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్, ఎంటీఎస్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 11, 2025
తాజా అప్డేట్స్

* AP: ఉప్పాడ తీరప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
* నకిలీ మద్యం కేసులో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. ఇంకా అరెస్టులు ఉంటాయి: మంత్రి డీబీవీ స్వామి
* TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే BJP అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
* ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ మంజూరు చేయాలని కేంద్రానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లేఖ
News October 11, 2025
నాకేం తొందర లేదు.. సీఎం మార్పు వార్తలపై డీకే శివకుమార్

కర్ణాటకలో సీఎం మార్పు వార్తలపై Dy.CM డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తొందరేం లేదని, తన తలరాత ఏంటో తనకు తెలుసని అన్నారు. ‘నేను సీఎం అయ్యేందుకు సమయం ఆసన్నమైంది’ అని తాను అన్నట్లు వార్తలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు నిజాలను వక్రీకరించి సెన్సేషనలిజం, పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా నవంబర్‌లో సర్కారులో మార్పులొస్తాయని ఊహాగానాలు సాగుతున్నాయి.