News February 16, 2025

నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత

image

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభారంతో HYD ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ‘సతీ అనసూయ’ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. ‘మనదేశం’ సినిమాతో NTRను చిత్రరంగానికి పరిచయం చేశారు.

Similar News

News December 8, 2025

పచ్చిరొట్టగా పెసర/మినుముతో లాభాలు

image

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.

News December 8, 2025

‘అఖండ-2’ విడుదలపై క్లారిటీ అప్పుడే?

image

‘అఖండ-2’ను ఈ నెల 12న విడుదల చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే డిసెంబర్ 25కు రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 12న విడుదలైతే వచ్చే వారంలో ‘అవతార్-3’ రిలీజ్ ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈరోస్ సంస్థతో వివాదం విషయమై రేపు క్లారిటీ రానుందని, ఆ తర్వాతే రిలీజ్ డేట్‌పై ప్రకటన వస్తుందని వెల్లడించాయి.

News December 8, 2025

శబరిమల: 18 మెట్లు దేనిని సూచిస్తాయంటే?

image

పదునెట్టాంబడిలో మొదటి 5 మెట్లు మనిషిలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుని మందుకు సాగాలనే సారాంశాన్ని అందిస్తాయి. తర్వాత వచ్చే 8 మెట్లు కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం అనే 8 రాగద్వేషాలను సూచిస్తాయి. వాటిని వదిలి మంచి మార్గంలో నడవాలని చెబుతాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలకు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీక. <<-se>>#AyyappaMala<<>>