News January 18, 2025
జేసీ ప్రభాకర్ రెడ్డిపై MAAకు నటి ఫిర్యాదు
టీడీపీ నేత <<15051797>>జేసీ ప్రభాకర్ రెడ్డిపై<<>> ఫిల్మ్ ఛాంబర్, MAAకు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్ క్షమాపణ చెబితే సరిపోదని, ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశానన్నారు.
Similar News
News January 18, 2025
‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్.. రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్
జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని హీరో రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు. అయితే వాటిని పునరావృతం చేయకుండా ఉండటమే కీలకం. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుంది’ అని ఓ షోలో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
News January 18, 2025
భారత జట్టుపై మీ కామెంట్?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టును ప్రకటించగా కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ రెడ్డితో పాటు కరుణ్ నాయర్‌ను తీసుకోకపోవడంపై విమర్శలకు దిగారు. టీమ్‌కి 15 మందే కావాలని అజిత్ అగార్కర్ అనడంపై సెటైర్లు వేస్తున్నారు. జట్టులో ఉన్నవారంతా అద్భుత ప్లేయర్లేనా? అని ప్రశ్నిస్తున్నారు. యంగ్స్టర్లకు అవకాశమివ్వాలని, సెంచరీలు చేసిన కరుణ్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.
News January 18, 2025
సంజూ శాంసన్‌కు భారీ షాక్?
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విజయ్ హజారే ట్రోఫీకి దూరమైన సంజూ శాంసన్‌పై BCCI గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి పక్కన పెట్టింది. అతను సరైన కారణం చెప్పకపోతే ODIలకు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని BCCI వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది దేశవాళీ క్రికెట్‌కు డుమ్మా కొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారని గుర్తు చేశాయి.