News April 11, 2025

పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష.. నటి ఫైర్

image

తమిళనాడులో నెలసరి బాలికను <<16051110>>తరగతి గది బయట<<>> కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటనపై నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఫైరయ్యారు. ‘ఈ ఘటన విచారకరం. నన్ను షాక్‌కు గురిచేసింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిగ్గుగా లేదా?’ అని స్కూల్ సిబ్బందిని దుయ్యబట్టారు. నెలసరి అనేది సహజమని, మానసికంగా ఎదుగుదల లేని అధికారులకు బుద్ధి చెప్పాలని మండిపడ్డారు.

Similar News

News November 22, 2025

ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

image

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.

News November 22, 2025

iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్‌ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.

News November 22, 2025

బీస్ట్ మోడ్‌లో సమంత

image

ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న నటి సమంత సడన్‌గా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లారు. తాజాగా తన ఫిట్‌నెస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె తన బ్యాక్, ఆర్మ్స్ మజిల్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ తన అథ్లెటిక్ బాడీని చూపించారు. ఒకప్పుడు ఇలాంటి బాడీ తనకు సాధ్యం కాదని అనుకున్నానని, కానీ ఇప్పుడు సాధించానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె ఫిట్‌నెస్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.