News January 6, 2025
నటికి వేధింపులు.. 30 మందిపై కేసు

సోషల్ మీడియాలో కొందరు తనను <<15073430>>వేధింపులకు గురిచేస్తున్నారని<<>> హీరోయిన్ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు ఓ బిజినెస్‌మన్ తనను వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభ్యంతరకర కామెంట్లు చేయడంతో ఆమె ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించారు. వారి కామెంట్లు మానసిక వేధింపులకు కారణమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 26, 2026
పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?

పెళ్లి తర్వాత తనవారికి దూరమై కొత్త జీవితం ప్రారంభించే వధువుకు ఆ దూరం వల్ల కలిగే బాధ వర్ణనాతీతం. ఆ తల్లిదండ్రుల, కుమార్తె మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ‘ఒడిబియ్యం’ సంప్రదాయం. ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని, కూతురుని మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మనసారా ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తులు, పసుపు-కుంకుమ ఇచ్చి గౌరవించడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
News January 26, 2026
నవ గ్రహాలు – వాటి ఇష్ట వర్ణాలు

ఆదిత్యుడు- ఎరుపు
చంద్రుడు – తెలుపు
అంగారకుడు – ఎరుపు
బుధుడు – చిగురాకు పచ్చ
గురు – పసుపు
శుక్రుడు – తెలుపు
శని – నలుపు
రాహువు – నలుపు
కేతువు – ఎరుపు
News January 26, 2026
రియల్ హీరో.. ప్రాణాలకు తెగించాడు!

ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే గుణం చాలా గొప్పది. నాంపల్లి <<18951833>>అగ్నిప్రమాదంలో<<>> చిక్కుకున్న వారిని దినేశ్ అనే వ్యక్తి రక్షించి హీరోగా నిలిచారు. మంటలు ఎగిసిపడుతున్నా ప్రాణాలకు తెగించారు. అంతా వీడియోలు తీస్తుంటే దినేశ్‌తో పాటు మహమ్మద్ జకీర్, కలీం, రహీం, అమర్‌లు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు HYD CP సజ్జనార్ తెలిపారు. వీరిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు.


