News September 29, 2024
నటి కుష్బూ ట్వీట్.. థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్

తాను లండన్లో ‘దేవర’ సినిమా చూసినట్లు సీనియర్ నటి కుష్బూ ట్వీట్ చేశారు. ‘ఇతనే నా హీరో. సూపర్బ్ మాస్. దీనిని నేను ఎలా మిస్ అవుతాను? దేవరగా అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని పేర్కొన్నారు. దీనికి Jr.NTR ‘థాంక్యూ మేడమ్. మీకు నచ్చినందుకు సంతోషం’ అని రిప్లై ఇచ్చారు. తారక్ తన ఫేవరెట్ యాక్టర్ అని కుష్బూ గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.
Similar News
News January 7, 2026
వరి మాగాణుల్లో వెల్లుల్లి సాగు.. మంచి దిగుబడి, ఆదాయం

మన దగ్గర సాధారణంగా వరి కోతలు పూర్తయ్యాక అదే భూమిలో మొక్కజొన్న, సన్ ఫ్లవర్, అపరాలు నాటుతుంటాం. బంగ్లాదేశ్లో మాత్రం వరి కోతలు పూర్తయ్యాక ఆ భూమిలో వెల్లుల్లి నాటుతారు. వరి పంటకు వేసిన ఎరువుల వల్ల నేల సారవంతంగా ఉంటుంది. భూమిలో తేమ, వరికి వాడిన ఎరువుల వల్ల వెల్లుల్లి పంట చాలా వేగంగా, పెద్ద పరిమాణంలో పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభిస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.
News January 7, 2026
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని చెప్పింది. అయితే తుఫానుగా మారుతుందా? లేదా? అనేది ప్రకటించలేదు. వాయుగుండంగా మారిన తర్వాత తమిళనాడుతో పాటు ఈ నెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News January 7, 2026
త్వరగా పెళ్లి కావాలంటే.. పఠించాల్సిన మంత్రాలు

*కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరీ|
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః||
*అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః|
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర||
*విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే||
*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే|
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే||


