News June 27, 2024
కస్టడీలోనూ నటి మేకప్.. మహిళా SIకి నోటీసులు

రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, కన్నడ నటి పవిత్ర గౌడ పోలీస్ కస్టడీలోనూ మేకప్ వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. విచారణలో భాగంగా ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పవిత్రను ఒకరోజు బెంగళూరులోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ గ్యాప్‌లో లిప్‌స్టిక్, మేకప్ వేసుకున్న ఆమె నవ్వుతూ ఇంటి నుంచి బయటికి వచ్చారు. దీంతో మేకప్‌కు అనుమతించిన మహిళా ఎస్సైకి కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు.
Similar News
News October 16, 2025
‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్?

‘బలగం’తో డైరెక్టర్‌గా మారిన కమెడియన్ వేణు ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు నాని నుంచి నితిన్‌కు, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు DSP పేరు వినిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
News October 16, 2025
సెమీస్‌లో 3 బెర్తులు.. పోటీలో నాలుగు జట్లు!

WWC సెమీస్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ బంగ్లాపై విజయంతో AUS సెమీస్‌కు దూసుకెళ్లింది. మిగిలిన 3 స్థానాల కోసం ప్రధానంగా 4 జట్ల మధ్యే పోటీ ఉండనుంది. పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో చివరి 3 స్థానాల్లో ఉన్న బంగ్లా(2), శ్రీలంక (2), పాక్(1) దాదాపు రేస్ నుంచి తప్పుకున్నట్లే. ENG(7), SA(6), IND(4), NZ(3) పోటీ పడనున్నాయి. పాయింట్స్‌తో పాటు రన్‌రేట్ కీలకం కానుంది. మీ ప్రిడిక్షన్ కామెంట్ చేయండి.
News October 16, 2025
ఆమెకు 1400 మరణశిక్షలు విధించాలి!

బంగ్లా మాజీ PM షేక్ హసీనాకు 1,400 మరణశిక్షలు విధించాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో ఆ దేశ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ వాదించారు. కనీసం ఒక్క మరణశిక్షైనా విధించకపోతే అన్యాయమేనన్నారు. అక్కడ గతేడాది JUL-AUGలో జరిగిన అల్లర్లలో 1400 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాలకు హసీనే కారణమని బంగ్లా ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.