News October 26, 2025
వందేళ్ల వయసులో నటి కన్నుమూత

అమెరికన్ నటి జూన్ లాక్‌హార్ట్ (100) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. 1925లో జన్మించిన ఆమె కాలిఫోర్నియాలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. లాస్సీ, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి TV సిరీస్‌లు, సార్జెంట్ యార్క్, హెవెన్ టూ, స్ట్రేంజ్ ఇన్వేడర్స్ వంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించారు. 2021 వరకూ నట ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎనిమిదేళ్ల వయసులో యాక్టింగ్ అరంగేట్రం చేసిన ఆమె దాదాపు 90 ఏళ్లపాటు ఈ రంగంలో కొనసాగారు.
Similar News
News October 28, 2025
వంటింటి చిట్కాలు

* టమాటాలు మగ్గిపోకుండా ఉండాలంటే, వాటిని కాగితం సంచిలో ఉంచి దానిలో ఓ యాపిల్‌ను పెట్టండి.
* ఖాళీ అయిన పచ్చడి సీసాలో దాని తాలూకు ఘాటు వాసన పోవాలంటే సగం వరకు గోరువెచ్చని నీరు నింపి రెండు చెంచాల వంటసోడా కలిపి కాసేపు వదిలేయండి. తరువాత శుభ్రంగా కడిగి వాడుకోండి.
* కేక్ తయారు చేసేటప్పుడు గుడ్డు, మైదా మిశ్రమం కాస్త మెత్తగా ఉండేట్లు చూసుకోండి. లేదంటే కేకు గట్టిగా, పొడిబారినట్లు అవుతుంది.
News October 28, 2025
భారీ వర్షాలు.. అన్నదాతలకు సూచనలు

భారీ వర్షం సమయంలో నీళ్లను బయటకు పంపాలని పొలానికి వెళ్లొద్దు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత పరిస్థితిని బట్టి వెళ్లండి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటి తీరం వద్దకు వెళ్లొద్దు. నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలను దాటేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ మోటార్లు, స్తంభాలను తాకవద్దు. వాటి దగ్గరకు వెళ్లవద్దు. పిడుగు పడే సమయంలో చెట్లకింద ఉండొద్దు. పిడుగులు పడేటప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.
News October 28, 2025
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

APPSC విడుదల చేసిన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్(3), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులను అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత డిప్లొమా, BSc, B.Ed, MA, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వెల్ఫేర్ ఆర్గనైజర్(10), జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్(7), Jr అకౌంట్(7), Sr అకౌంట్స్(4) పోస్టులకు అప్లైకి రేపు ఆఖరు తేదీ.


