News October 5, 2025

నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత

image

బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్(94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘అమర్ భూపాలి’ అనే మరాఠీ మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె ‘జనక్ జనక్ పాయల్ బాజే, స్త్రీ, పింజారా, నవరంగ్’ వంటి హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె భర్త శాంతారామ్ లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా పేరొందారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

Similar News

News October 5, 2025

డీమార్ట్ ఆదాయం పెరుగుదల

image

డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆ సంస్థ ఆదాయం రూ.16,219 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.14,050కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2025 సెప్టెంబర్ నాటికి దేశంలో డీమార్ట్ స్టోర్ల సంఖ్య 432కు చేరింది. ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో డీమార్ట్ బిజినెస్ నిర్వహిస్తోంది.

News October 5, 2025

ఇవాళ చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

HYDలో చికెన్ ధర స్కిన్ లెస్ రూ.230-రూ.240గా ఉంది. కామారెడ్డిలో రూ.240కు విక్రయిస్తున్నారు. విశాఖలో స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.270, స్కిన్‌తో రూ.260, మటన్ కిలో రూ.1000గా ఉంది. విజయవాడలో కిలో చికెన్ ధర రూ.210-రూ.220, కృష్ణా జిల్లాలో రూ.200-రూ.210, పల్నాడు జిల్లాలో రూ.220-రూ.230గా అమ్మకాలు జరుగుతున్నాయి. నూజివీడులో మటన్ కిలో రూ.750, చికెన్ కిలో రూ.200లకు విక్రయిస్తున్నారు.

News October 5, 2025

మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి: సిట్

image

AP: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రద్దుచేయాలని హైకోర్టులో CID ఆధ్వర్యంలోని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ACB కోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో చట్టపరమైన లోపాలున్నాయని పేర్కొంది. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌లో తన నేర చరిత్ర వివరాలను పేర్కొనకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. పిటిషన్ దాఖలు చేసిన 10 రోజులకే బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.