News October 19, 2025

నటి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణ

image

బిహార్ ఎన్నికల వేళ భోజ్‌పురి నటి సీమా సింగ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. NDA కూటమి అభ్యర్థి(LJP)గా ఆమె దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్‌లో లోపాలున్నాయని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో చాప్రా(D) మఢేరా అసెంబ్లీ స్థానంలో RJD, JSP మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అయితే నామినేషన్‌లోని చిన్నలోపంపై SECకి వివరించామని, సమస్య పరిష్కారమవుతుందని LJP చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెప్పారు.

Similar News

News February 13, 2026

పోస్టల్ బ్యాలెట్.. లీడింగ్‌లో కాంగ్రెస్

image

TG: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చింది. ఏదులాపురం (ఖమ్మం), మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. నిర్మల్, ఖానాపూర్‌, కాగజ్‌నగర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘అర్ధనారీశ్వర’’

image

ప్రకృతి, పురుషుడు వేరు కాదని చాటిచెప్పే అద్భుత రూపమిది. లోక కల్యాణం కోసం శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీ దేవికి ఇచ్చి ‘అర్ధనారీశ్వరుడు’ అయ్యాడు. కుడిభాగం శివుడు(పురుష తత్త్వం), ఎడమభాగం పార్వతి(స్త్రీ తత్త్వం). సృష్టిలో స్త్రీపురుషులు సమానమని, ఒకరిలో ఒకరు ఇమిడి ఉన్నారని ఈ రూపం తెలియజేస్తుంది. శక్తి లేనిదే శివుడు లేడు. శివుడు లేనిదే శక్తి లేదు అనే పరమ సత్యాన్ని ఈ రూపం ద్వారా మనం గ్రహించవచ్చు.

News February 13, 2026

607 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌(NLCIL) 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in