News December 2, 2024
నటి ఆత్మహత్య.. మామ ఏమన్నారంటే?

సీరియల్ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె మామ బుచ్చిరెడ్డి స్పందించారు. శోభితను కన్నబిడ్డలా చూసుకున్నామని, తమతో బాగా కలిసిపోయిందని చెప్పారు. తన కుమారుడు సుధీర్ రెడ్డితో అన్యోన్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. కాగా పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా కర్ణాటకకు తీసుకెళ్లారు.
Similar News
News April 10, 2026
ఓట్లతో రికార్డులు బద్దలుకొట్టారు!

ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అస్సాం, పుదుచ్చేరిలో ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ పర్సంటేజ్‌లో రికార్డులను బద్దలుకొట్టారు. అస్సాంలో ఇప్పటివరకు 84.67% అత్యధిక ఓటింగ్ కాగా ఇవాళ 85.38% నమోదైంది. పుదుచ్చేరిలో 89.83శాతంతో గత రికార్డ్(86.19%) బ్రేక్ అయింది. ఇక కేరళంలోనూ లాస్ట్ టైమ్(74.06%) కంటే ఈసారి(78.03%) అధిక పోలింగ్ నమోదైంది. ఈ రికార్డ్ ఓటింగ్ ఎవరికి కలిసొస్తుందో మే 4న ఫలితాలతో తేలనుంది.
News April 9, 2026
IPL: గ్రీన్ బౌలింగ్ చేశాడోచ్!

KKR ఆల్‌రౌండర్ గ్రీన్ ఎట్టకేలకు బౌలింగ్ చేశారు. రూ.25.2కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ తొలి మూడు మ్యాచుల్లో బౌలింగ్ చేయకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. KKR యాజమాన్యంపైనా విమర్శలొచ్చాయి. కాగా ఇవాళ LSGతో మ్యాచులో ఆయన బౌలింగ్ చేసి 2వ బంతికే పంత్ వికెట్ తీశారు. అయితే వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న గ్రీన్ ఫిట్నెస్ లేక బౌలింగ్ చేయట్లేదని CA ఇప్పటికే వివరణ ఇచ్చింది.
News April 9, 2026
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో <<19609767>>తీవ్ర వడగాలులు<<>> వీస్తాయని పేర్కొంది.


