News November 23, 2024
EVMలపై అనుమానం వ్యక్తం చేసిన నటి

MHలోని అనుశక్తి నగర్‌లో తన భర్త, NCP SP అభ్యర్థి ఫహద్ అహ్మద్ 3వేల ఓట్ల తేడాతో ఓడిపోవడంతో నటి స్వరా భాస్కర్ EVMలపై ఆరోపణలు చేశారు. రౌండ్ 17, 18, 19లలో ఈవీఎంలు కౌంటింగ్ పూర్తయ్యాక కూడా 99శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ‘రోజంతా ఓటు వేసిన యంత్రాల్లోని బ్యాటరీలలో 99% ఛార్జింగ్ ఎలా ఉంటుంది. వీటిల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా ఓట్లొచ్చాయి’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News December 7, 2025
ఆడపిల్లలు కాటుక ఎందుకు పెట్టుకోవాలి?

కాటుక అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం. వివాహ వేడుకల్లో దీవెనల కోసం దీన్ని ధరిస్తారు. ఆరోగ్యపరంగా.. కాటుక కళ్లకు చల్లదనం, ఉపశమనం ఇస్తుంది. ఇది కంటిపై ఒత్తిడి, చికాకును తగ్గిస్తుంది. సూర్యకిరణాల నుంచి కంటి ప్రాంతాన్ని రక్షిస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి స్థానం ఉంది. అయితే సహజ కాటుకే ఉత్తమమైనది. నెయ్యి దీపం మసితో తయారు చేసుకున్న కాటుకతో ప్రయోజనాలెక్కువ. బయట కొనే కాటుకలను నాణ్యత చూసి ఎంచుకోవడం మంచిది.
News December 7, 2025
కోడి పిల్లలను షెడ్డులోకి వదిలే ముందు జాగ్రత్తలు

కోడి పిల్లలను షెడ్డులోకి వదలడానికి 10 రోజుల ముందే షెడ్డును శుభ్రపరచి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లను క్లీన్ చేయాలి. వరి పొట్టును 2-3 అంగుళాల మందంలో(లిట్టర్) నేలపై వేసి.. దానిపై పేపరును పరచాలి. కోడి పిల్లల మేత, నీటి తొట్లను బ్రూడరు కింద ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. బ్రూడరు చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టను వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి.
News December 7, 2025
CSIR-CCMBలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ &మాలిక్యులర్ బయాలజీలో 13 సైంటిస్టు పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని జనవరి 6వరకు పోస్ట్ చేయాలి. నెలకు జీతం రూ.1,38,652 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో విద్యార్హత, వయసు, పరీక్ష విధానం వెల్లడించనున్నారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in/


