News December 2, 2024

బిడ్డకు జన్మనిచ్చిన నటి

image

నటి సోనాలి సైగల్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 27న తనకు బిడ్డ పుట్టినట్లు ఆమె ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. చిన్నారికి ‘శుకర్’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. గతేడాది ఆశేష్ ఎల్ సజ్‌నానిని సోనాలి వివాహం చేసుకున్నారు. ఆమె హైజాక్, వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచ్‌నామా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లో నటించారు.

Similar News

News March 26, 2026

తిరుమల కొండపై హోటళ్లు బంద్.. అన్నదాన సత్రంపై ఒత్తిడి

image

గ్యాస్ కొరత తిరుమల భక్తులను ఇబ్బందుల్లోకి నెట్టింది. సిలిండర్లు దొరక్క కొండపై 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా TTD ఉచిత అన్నప్రసాదానికి క్యూ కడుతున్నారు. గత నెలతో పోలిస్తే అదనంగా లక్ష మంది అన్నప్రసాదం స్వీకరించారు. TTD నిత్యం 6 టన్నుల గ్యాస్‌ను వంట కోసం వాడుతోంది. ప్రస్తుతం IOCL నుంచి గ్యాస్ అందుతున్నా హోటళ్ల మూసివేత వల్ల అన్నదాన విభాగంపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది.

News March 26, 2026

పెట్రోల్ సమస్య.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్!

image

హైదరాబాద్‌లో పెట్రోల్ సమస్యతో కొన్ని IT కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, TCS వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా, మరికొన్ని సంస్థలు 50-50 విధానం తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. HYDలో దాదాపు 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది బైకులు, కార్లలో రాకపోకలు సాగిస్తారని సమాచారం.

News March 26, 2026

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ లాంచ్?

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా, గుర్తుగా ‘ధర్మగంట’ను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.